Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 21-NOV-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                       Daily Promise 21-NOV-2019
 
లోకమును జయించే 

"దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే" 
( 1 యోహాను 5:4 )

సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనము ధైర్యము వహించాలి. ఈ జీవితములో  మనకు వ్యతిరేకముగా ఏమివచ్చినాగాని వాటిని జయించటానికి దేవుని వాగ్ధానము గట్టిగా పట్టుకొని విశ్వసించటమే. శతృవు మనపైన వ్యాధి, బాధ, లేక కొరత అనేవాటితో దాడిచేసినప్పుడు, నీవు దృడముగా నిల్చొని గుర్తుంచుకోవలసినది ఏమిటంటే నీకు స్వస్థత, నిరీక్షణ, మరియు అవసరతలను సమకూర్చే దేవుడు నీతోకూడా వున్నారని గుర్తుంచుకోవలి. నీ జీవితములో ప్రతీ బాగములో దేవుడు నీకు విజయమిస్తానని వాగ్ధానము చేసారు. దేవుడు నిన్ను సృజించినది విజయునిగా వుండటానికి కాని విఫలునిగా కాదు. నీ ఇంటిలోనూ, పనిలోనూ , బాంధవ్యాలలో  నీవు జయకరముగావుండాల్సినదే. ఈ లోకమును నిన్ను జయించకూడదు. దేవుని వాక్యమును విశ్వసించి ఒప్పుకొనుట  ద్వారా నీవు లోకమును జయించే విజయకరమైన జీవితమును జీవించగలవు.

ప్రార్ధన: దేవా  నేను ఎప్పుడూ ఈ లోకపు వత్తిడులతో, సమస్యలలోను మునిగిపోయినట్లుంటాను. మీపైననే నా దృష్టిని పెట్టి మీ ప్రణాళికను గైకొనుటకు మనస్సును దయచేయుమని వెడుకొనుచున్నను. తండ్రీ నా జీవితములో ప్రతీబాగములో విజయునిగా నిల్చొనేటట్లు  స్థిరమైన విశ్వాసములో నిలకడగావుండే కృపను దయచేయుమని యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రీ!ఆమెన్.

Post a Comment

0 Comments