Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 20-NOV-2019

*ఆశీర్వదించబడిన వ్యక్తి,దినము,దినములోని ఒక ఘట్టము* 

హెబ్రీయులకు 6: 14
తనతోడు అని ప్రమాణముచేసి *నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును* అని చెప్పెను.

*ఆశీర్వదించబడిన వ్యక్తి*

దేవుని చేత పిలువబడి "తన స్వదేశాన్ని తండ్రి ఇంటిని స్వంత జనులను" విడచి దేవుని మాటను నమ్మి సమస్తమును వదలుకొని  అబ్రహాము దేవున్ని వెంబడించాడు.అందుకు ప్రతిఫలంగా గొప్ప దీవెనను ఆశీర్వదాన్ని పొందుకున్నాడు.ఈరోజున మన గమనిస్తే ఆయా సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆ మాటను విన్నప్పుడు విశ్వాసంతో కొంతవరకు బాగానే ధైర్యంగా ఉంటున్నాం! గాని ఏదైనా శ్రమ కలుగుగానే ఏదైనా ప్రతికూలంగా జరిగితే మాత్రం మనలోని విశ్వాసం క్షణికావేశంలోనే కనుమరుగైపోతోంది! వెంటనే దేవునిపై దేవుని వాగ్ధానంపై అపనమ్మిక,సందేహం చొటుచేసుకుంటున్నాయి.!

అందుకే  "వాగ్ధానఫలాన్ని" పొందలేని పరిస్థితి కలగుతుంది.మన పితరుడైన  "అబ్రహాము" అయితే 
📖హెబ్రీయులకు 6: 15
*ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.* "క్రీస్తుయేసు" ద్వారా మనము కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదములో పాలిభాగస్థులం కాగలిగాం!
📖గలతియులకు 3: 13
 *అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై(మూలభాషలో-శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను;* అందునుబట్టి మనంమందరము ఆశీర్వదించబడిన వ్యక్తులమే వాగ్ధానాలకు వారసులమే!

*ఆశీర్వదించబడిన దినము*

అయితే ఈ ఆశీర్వదించబడిన వ్యక్తి ఏం చేయాలి? లేఖనములనుబట్టి దేవుని మాట ఏమిటి? అంటే ఈ ఆశీర్వదించబడిన వ్యక్తి "దేవుడు పరిశుద్ధపరచి, ఆశీర్వదించిన దినాన్ని" ఆచరించాలి! ఏమిటి ఈ విచిత్రం ఏం మాట్లాడుతున్నారు అలాంటి "దినం లేక రోజు" కూడా ఉందా? అని ఆశ్చర్యపడకండి! చూడండి...ఆదిలోని 
📖ఆదికాండము 2: 2
దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.
📖ఆదికాండము 2: 3
కాబట్టి దేవుడు *ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను;* ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

*ఆశీర్వదించబడిన దినములోని ఒక ఘట్టము*

ఆశీర్వదించబడిన దినముగానే మనకు సర్వసాధారణంగా అర్ధం అయిపోయింది అది "ఆదివారం అని పునరుద్థాన దినమని"  మరి ఆ ఆదివారపు ఆరాధనలో "ఆశీర్వదించబడిన ప్రాముఖ్యమైన ఘట్టము" *ప్రభురాత్రి భోజనం*
📖1కోరింథీయులకు 10: 16
మనము దీవించు ఆశీర్వచనపు (గిన్నె) పాత్రలోనిది(లేక,మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది) త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? రక్షణ పొందిన ప్రతిఒక్కరు తప్పనిసరిగా ప్రతి ఆదివారమున "బల్లలో" పాలుపొందాలి అప్పుడే నిత్యజీవానికి వారసులం అవుతాము ఆశీర్వదించబడిన నూతన యెరూషలేములో ప్రవేశించగలగుతాం!
📖యోహాను 6: 53
కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.
📖యోహాను 6: 54
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.


అట్టి కృప ధన్యత ప్రభువు మనకందరికీనీ అనుగ్రహించునుగాక!ఆమేన్

Post a Comment

0 Comments