🙏🙏 ప్రార్థన 🙏🙏
మాకు మేలు చేస్తు అపవాది కట్లను విప్పి స్వస్థపరచు యేసు నీకే స్తోత్రం. అపో. కార్యములు 10:38
🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇🙇తేజోమయుడా సర్వపరిపాలకుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు తండ్రి.దేవా ఈరోజు ప్రతిఒక్కరిని దర్శించుము తండ్రీ ఏదో ఒక భయముతో పీడించబడుతూ మనుషులకు భయపడుతూ భయము వలను అబద్ధంలాడుతూ భయముచే నిండుకొని మోసం చేస్తూ తమ్ముని తాము హీనస్థితికి నడుస్తున్న ప్రతి ఒక్కరినీ ఈ క్షణమే దర్శించి అలనాడు మోషేకు తోడైయున్నటు మాకును మీరు తోడై ఉన్నారు అని మేము నమ్మి విశ్వసించి ధైర్యంగా నడుచులాగున మీ పరిశుధాత్మ సహయము చేయుము తండ్రీ.దేవా ఈరోజు అనేక మంది రకరకాల మరణకరమైన వ్యాధిలతో మరణపాయ స్థితిలో భాధపడుతున్న బిడ్డలను దర్శించుము తండ్రీ వారిపై సాతానుకి ఎటువంటి అధికారము లేకుండా కేవలం నీవు పొందిన దెబ్బలచేత మాకు స్వస్థత అని మీరు చెప్పిన విధముగా ఆ బిడ్డల శరీరంలోకి ఇప్పుడే మీరు శిలువపై కార్చిన పరిశుద్ధ రక్తం ప్రొక్షించి వారిని స్వస్థత పరుచుము తండ్రీ.దేవా ఈదినమున మాఇంటి సమస్యలు గాని వ్యక్తిగత సమస్య గాని తీర్చుకోలేని బైట సమస్యలు గాని మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుకొనుచున్నాము తండ్రీ.దేవా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు కనుక మా జీవితంలో గొప్ప కార్యములు శురాకార్యములు జరిగించుము తండ్రీ.దేవా ఈరోజు మేము వెళ్లు ప్రతి పనిలో మా మార్గంలోను మాటలోను ప్రవర్తనలోను సమస్తము మీ అధికారంనకు ఒప్పుకోనుచున్నాము తండ్రీ.దేవా మీరెక్కల కాపుదలలో మీ కృపా కనికరం క్రింద మాజీవితాలను సంరక్షించి కాపాడుము తండ్రి.దేవా ఈదిన దీవెనలతో మమ్మల్ని మా కుటుంబములను దీవించుము అని ఈ నా ప్రార్థన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్.🙇🙇🙇
0 Comments