🙏🙏ప్రార్థన🙏🙏
మమ్మల్ని విమోచించి మా దుఃఖమును నిట్టూర్పును తొలగించు యేసు నీకే స్తోత్రము.
యెషయ 51:11
🙇🙇🙇🙇🙇🙇🙇🙇
ఆది సంభూతుడా సకలచర ప్రాణులు సృష్టికర్త మా ప్రియ పరలోకపు తండ్రీ మీకే స్తుతి స్తోత్రములు గడిచిన గత కాలము అంత మాకు ఎంతో శ్రేష్ట్రమైన ఇవులతో మీ కృప క్షేమములతో మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే మహిమ ఘనత ఎనలేని స్తుతులు స్తోత్రంలు తండ్రి.దేవా ఈరోజు ఉదయ కాలమున మా జీవితంలో అనేక సార్లు కృంగిపోతున్నము నిరుత్సాహ పడిపోతున్నాము దిగులు పడిపోతున్నాము తండ్రీ.దేవా మా చుట్టు ఉన్న పరిస్థితులు చూస్తూ ఈలోకములో ఏమి సాధించలేకపోతున్నాము అని ఆలోచిస్తూ అనుకున్నవి జరగకపోగా ఆపదలు విపత్తులు కలుగుతూ ఉంటే ఎంతో దుఃఖముతో మనో వేదనతో కృంగిపోతున్నారో వారిని చూడుము తండ్రీ వారి జీవితాల్లో ఈక్షణమే క్రీస్తు నామములో విడుదల దయ చేయుము తండ్రీ.దేవా ఆకాశ పక్షులను పోషించిన దేవుడవు మమ్మల్ని పోషించగలవు అని అడవి పువ్వులను అలంకరించిన దేవుడవు మా అవసరతలు తీర్చగలవు అని మేము నమ్ముటకు సహాయము చేయుము తండ్రి.దేవా ఈ లోకములో మేము చేయు ప్రతి పనుల మార్గంలోను మా క్రియలలోను మా తలంపులలోను మా స్వబుద్ధిని ఆధారము చేసుకోనక మీ చిత్త ప్రకారం చేయులాగున మా మార్గములు సరళము చేసి నడిపించి మీ చిత్తములో దీవించుము తండ్రి.దేవా మా స్వయంకృత అపరాధము వల్ల మేము చేసిన పాపములు శాపములుగా మారి మా బిడ్డల జీవితలపై పడకుండా మా బిడ్డలను రక్షించి వారి జీవితాలను మీ చిత్త ప్రకారం దీవించి ఆశీర్వాదించుము తండ్రీ. దేవా ఈ ఉదయ కాలము నిండు గర్భవతులైన ఆడబిడ్డలను జ్ఞాపకము చేసుకొనుచున్నాము వారిని దీవించి వారికి సుఖ ప్రసవం అనుగ్రహంచి మంచి ఆరోగ్యకరమైన బిడ్డలను అనుగ్రహించుము తండ్రీ. దేవా ఎన్నో సంవత్సరలు గర్భ ఫలాలు లేక అవమానలతో ఛీదరింపులతో కృంగిపోయి బాధ పడుతున్న బిడ్డలు కన్నీటితో మీ పాద సన్నిధిలో విన్నవించుకొంటున్న వారి గర్భ ద్వారములను ఈక్షణమే క్రీస్తు నామములో తెరువుము తండ్రి.దేవా ఎంతో మంది బిడ్డలు చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక జీవనోపాధి కోసము ఉద్యోగములు కోసము ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలకు మీ కృపా గల హస్తంతో దీవించి వారి సరిహద్దులు విశాల పరచి ఆశీర్వాదించుము తండ్రీ.దేవా మా ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటు నీ కుమారుడు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Have a nice day
0 Comments