Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 06-DEC-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 06-DEC-2019
  నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలు. (కీర్త 119:71) 
ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చు కొనెను. (హెబ్రీ 5:8) క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. (రోమా 8:17,18) 
నేను నడచుమార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించితిని. (యోబు 23:10,11)
నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని, ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. (ద్వితీ 8:2,5,6)

బలముచేత ఎవడును జయము నొందడు. (1సమూ 2:9) 
దావీదు - నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నామీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. తన సంచిలో చెయ్యివేసి, అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ... దావీదు ... వడిసెల తోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. (1సమూ 17:49,50) 
ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు. ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టు వారిమీదను నిలుచు చున్నది.

Post a Comment

0 Comments