పరిపూర్ణమైన బహుమతి
శ్రేష్టమైన ప్రతి యీవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనా గమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు. యాకోబు 1:17.
మనమందరము బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటుంటాము. మన ప్రియుల నుండి బహుమతులు పుచ్చుకుంటే మన ఆనందం రెండంతలవుతుంది. మనము ఆ వ్యక్తిని బాగుగా ఎరుగుదుము గనుక మనకు నచ్చిన ఇష్టమైన బహుమతే ఆ వ్యక్తి ఖచ్చితంగా యిస్తారని మనకు తెలుసు. మనకిష్టం లేనివి ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి ఇవ్వలేరని కూడా బాగా తెలుసు. వాళ్ళు మనకు బట్టలు ఇచ్చినట్లయితే మన ఇష్టానికి తగ్గట్టుగా, మనకిష్టమైన రంగులోనే ఉంటాయి. మనము వాళ్ళను చాలా ఆరాధనపూర్వకంగా చూస్తాము. అలాంటప్పుడు మరి మన పరలోకపు తండ్రి, మనకు ఇంకెంత మంచి బహుమానాలు ఇస్తారో కదా. నేను నా పరలోకపు తండ్రి నుండి పొందిన అతి శ్రేష్టమైన బహుమతులేవంటే నా భర్త మరియు నా ఇద్దరు కుమారులు. వాళ్ళ కొరకు నేను నా తండ్రికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా చాలా తక్కువే.
దేవుడు మనకొక బహుమానమునిచ్చినట్లైతే, దానితో ఏవి కూడా సాటి రావు. దేనితో కూడా వాటిని పోల్చలేము. దేవుడిస్తున్న సంపూర్ణమైన బహుమానాలకు విలువ కట్టలేము. మనము అర్థము చేసుకోలేనంత గొప్ప బహుమానాలు. ఆయన విడిచిపెట్టలేని ప్రేమ కొరకు ఆయనను స్తుతించి, ఆరాధించి, ఆయన కుమారుడైన యేసు ప్రభువు నామమున అతి శ్రేష్ఠమైన బహుమతులు ఆయన నుండి పొందుకొందుము గాక. పరలోకము నుండి వచ్చే అద్భుతమైన బహుమతులతో నిరంతరమూ ఆశీర్వదింపబడి ఉందుము గాక.
ప్రార్థన :
ప్రియ ప్రభువా, మా పరలోకపు తండ్రి అయిన మీ నుండి గొప్ప ఆశీర్వాదాలు, అద్భుతమైన బహుమానాలు పొందుకోగల్గుటకు మాకు సహాయం చేయండి. ఆమెన్.
0 Comments