𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 16-NOV-2019
🙌🙌🙌దీవెన🙌🙌
🙌🙌🙌🙌🙌🙌🙌
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక శ్రేష్ట్రమైన ఉదయ కాలపు శుభములు.మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితలకు దేవుని కృపా తోడైయుండి మిమ్మల్ని దీవించును గాక. మీ రుణ బాధలు,ఆర్థిక సమస్యలు మీప్రతి అవసరతలు,మానసిక, శారీరక ఆనారోగ్యం సమస్యలు,క్షామము ప్రతి విధమైన ఇరుకులో నుండి ఈ క్షణంమే క్రీస్తు నామములో విడుదల కలుగును గాక.మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ విశ్వాసముతో సఫల పరచి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని మీ చేతి పనులను మీ జీవన విధానంలో ప్రతి పనిలో మీకు ప్రభువు తోడుండి మిమ్మల్ని దీవించి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి సంరక్షించును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్.🙌🙌🙌🙌🙌🙌🙌
🙏🙏ప్రార్థన🙏🙏
నీ కృపను మాపై కుమ్మరించి నన్ను తలగా నియమించి పైవాడు గా ఉంచుతాను అన్న యేసు నీకే స్తోత్రము.
ద్వితీయోపదేశ 28:14
🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇
రక్షక మహోన్నతుడా సర్వ సృష్టికర్త సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తుతి స్తోత్రములు, మాకు మరి యొక శ్రేష్ఠమైన ఉదయ కాల సమయమును ఇచ్చిన తండ్రి మీకు ఎనలేని స్తుతి స్తోత్రములు దేవా.ఈ దినములో మేము మా జీవన పయనం మొదలు పెట్టుచుండగా సమస్త అధికారము మీ చిత్తమునకు అప్పగించు కొనుచున్నాము తండ్రి. దేవా మీ చిత్తములో మా జీవన ప్రయణము నడిపించి నీ ప్రణాళికలో మేము ఉండులాగున మమ్మల్ని దీవించుము తండ్రీ.దేవా మా జీవితంలో మేము కలిగియున్న కొద్దీ స్థితిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా లేమి స్థితి నుండీ ఉన్నతి స్థితిగా మారుస్తున్న తండ్రీ మీకే స్తోత్రంలు.దేవా మాకు ఉండటానికి నివాసం లేకపోయినా మా జీవితంలో అంతగా ఆనందకరమైన కార్యములు లేకపోయినా మా బ్రతుకులో వేదన దుఃఖము ఉన్న ఏ స్థితిలో ఉన్న నా తండ్రీ నా దేవా మీకే స్తుతి స్తోత్రంలు ఈ స్థితిలో మాకు ఉన్న దానిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రీ.దేవా మా బలహీనతలను బలమైనవిగా మార్చండి మాలో ఉన్న కీడును మేలుగా మార్చండి మాలో ఉన్న చేదును మధురంగా మార్చండి మా జీవితాలలో అధ్బుతాలు చేయమని మీ పాద సన్నిధిలో గోజాడి వేడుకొనుచున్నాము తండ్రీ.దేవా మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులను విశాల పరుచుము దేవా.తండ్రి మా జీవితాల్లో మాతో ఈ మనుషులు లేకపోయినా ఫర్వాలేదు తండ్రీ కానీ మీరు మా జీవితాల్లో కావాలి ప్రభు మీ సన్నిధి నిత్యము మాతో ఉండాలి తండ్రీ.మీ హస్తము మమ్మల్ని పట్టుకొని నడిపించాలి తండ్రి.మీ కృప కనికరం అనుగ్రహించి మమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించుము తండ్రి.దేవా ఎంత మంది యవ్వన బిడ్డలు ఉద్యోగలు లేక నిరోద్యోగముతో బాధపడుతు సరైన జీవనోపాధి లేక కుటుంబములను పోషించుకొలేని నిస్సహాయ స్థితిలో ఉండి మానసికంగా శారీరకంగా నలిగిపోతున్న బిడ్డల జీవితాలను కట్టుము తండ్రీ వారి కుటుంబాలకు వారి జీవితాలకు కావలిసిన వారి కుటుంబములు జీవించటానికి కావలిసిన ప్రతి ఆర్థిక అవసరతలను తీర్చుము తండ్రి.దేవా నా మా పాపములు శాపములను ప్రతి అంధకార దూరాత్మ శక్తులు నుండి మమ్మల్ని విడిపించి కాచి కాపాడుము తండ్రీ.దేవా ఈ దినము అనేక మంది వారి చేతి పనులలోను వ్యాపారములలోను వెళ్లు ప్రతి పనిలో మార్గంలో క్షేమము సమృద్ధి కలుగజేసి కావలిసిన జయ జీవితంను అనుగ్రహించి.మీ ప్రేమ కృప కనికరం దయ చేసి దీవించి ఆశీర్వదించుము దేవా.ఎంతో మంది యవ్వన బిడ్డలు తప్పుడు త్రోవలు నడిచి భయంకరమైన రోగములతో దీర్ఘ కాలిక రోగములతో బాధపడుతు కన్న తల్లిదండ్రులకు కడుపు కోత పెడుతున్నారు ఆ తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థనలు ఆలకించి వారి జీవితాలను కట్టి మీ చిత్తములో జరిగించి క్రీస్తు నామములో అద్భుతమైన స్వస్థతలు అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించుము తండ్రీ.దేవా మమ్మల్ని ఈ దిన దీవెనలతో నింపుము అని ఈ నా ప్రార్థన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్
🛐🛐🛐🛐🛐🛐🛐
0 Comments