Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Daily Promise 12-NOV -2019

🙇🙇 ప్రార్థన🙇🙇
మా శ్రమలో కష్టములో మమ్మును      
 ఆదరించుచున్న యేసు నీకే స్తోత్రము.
2 కోరింధీ 1:4
🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇రక్షక మహోన్నతుడా సర్వ సృష్టికర్త సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తుతి స్తోత్రములు,మాకు మరియొక శ్రేష్ఠమైన ఉదయ కాల సమయమును ఇచ్చిన తండ్రి మీకు ఎనలేని స్తుతి స్తోత్రములు దేవా.ఈ మరియొక నూతన సోమవారం దినములో మేము మా జీవన పయనం మొదలు పెట్టుచుండగా తండ్రీ మా జీవితంలో కొండలాగా అడ్డుగా ఉన్న ప్రతి సమస్యలను తొలగించి తండ్రీ మా సమస్యలలో ఆర్ధిక ఇబ్బందులలోను మాకు జయము అనుగ్రహించుము తండ్రి.మీ చిత్తము మా జీవితాల్లో జరిగించుము దేవా మా సమస్త పనులలో మాకు తోడుగా ఉండి మా సరిహద్దులను విశాలపరుచుము దేవా.దేవా ప్రార్థనలు వ్యర్థం కాకుండా మాకు జవాబు దయచేయము మా జీవితాల్లో క్రీస్తు నామములో విడుదల సమాధానం నెమ్మది కలుగును గాక.తండ్రి మమ్మల్ని క్షమించి మీ దక్షిణ హస్తము క్రింద కాచి కాపాడుము తండ్రి. వాగ్దానం చేసిన దేవుడవు గొప్ప దేవుడువు మమ్మల్ని విడవవు ఎడబాయను అని చెప్పిన తండ్రీ.దేవా ఎంతమంది యవ్వన బిడ్డలు ఉద్యోగలు లేక సరైన జీవనోపాధి లేక కుటుంబముల పోషించలేక  మానసికంగా శారీరకంగా నలిగిపోతున్న బిడ్డలను ఆదరించుము తండ్రీ వారి కుటుంబాలకు వారి జీవితాలకు కావలిసిన రక్షణ సంతోషం సమృద్ధి సమాధానం దయచేయుము తండ్రి మీ చిత్తమైతే ఆబిడ్డల  కుటుంబములకు కావలసిన  ప్రతి అవసరతలను తీర్చుము తండ్రి.నా మా పాపములు శాపములను ప్రతి అంధకార దూరాత్మ శక్తులు నుండి మమ్మల్ని విడిపించి కాచి కాపాడుము తండ్రీ.దేవా ఈ దినము అనేకమంది వారి చేతి పనులలోను  వ్యాపారములోను వెళ్లు ప్రతి పనిలో మార్గంలో క్షేమము సమృద్ధి కలుగజేసి కావలిసిన జయ జీవితంను అనుగ్రహించి.మీ ప్రేమ కృప కనికరం దయచేసి దీవించి ఆశీర్వదించుము దేవా.ఎంతో మంది యవ్వన బిడ్డల వివాహము కొరకు కన్న తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.ఈ భయంకరమైన దినములలో వారి బిడ్డలకు మీ చిత్తము లో మంచి భాగస్వాములను అనుగ్రహించుము తండ్రి.ఆడపిల్లల తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనలు ఆలకించి మీ చిత్తము జరిగించి క్రీస్తు నామములో అద్భుతమైన నూతన కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించుము తండ్రీ.దేవా మమ్మల్ని ఈ దిన దీవెనలుతో దీవించుము అని ఈ నా ప్రార్థన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము.తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్.🛐🛐🛐🛐🛐🛐🛐

Post a Comment

0 Comments