నూతన మాసము,
మొదటి రోజు,
దీవెన🙏🙏🙏
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక నూతన మాసము శ్రేష్ఠమైన ఉదయ కాలపు శుభములు.ఈ నెల మొదటి రోజు మీరు తలపెట్టిన ప్రతి పనులలోను మీ వ్యాపారంలోను మీ చేతి పనులలోను మీ ఉద్యోగ బాధ్యతలలోను మీకు అడ్డుగా ఉన్న సమస్యలు ప్రతి అడ్డంకులు ప్రతి అంధకార దూరాత్మ శక్తులను ఈక్షణమే మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లయ పరుచును గాక.ప్రభు కృప కనికరంలు మీకు తోడైయుండును గాక. ఈరోజు మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు శారీరక బాధలు నుండి విడుదల దయ చేసి మీ జీవితాల్లో నూతన కార్యము జరిగించి ప్రతి ఆనారోగ్య సమస్యలు యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడిగి శుద్ధి చేయును గాక. యేసు నామములో మీ ప్రతి అవసరము తీరును గాక.ఈ నెల మిమ్మల్ని మీ చేతి పనులను మీ జీవన విధానములో ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక.ప్రభు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
0 Comments