🙇🙇♂ప్రార్థన🙇🙇♂
మా శరీరము క్షిణించిపోయినను మాకు ఆశ్రయదుర్గమైన యేసు నీకే స్తోత్రము.
కీర్తనలు 73:26
🙇🙇🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂నిత్యము దూతలతో కొనియడాబడుతున్న పరిశుద్ధుడా సమాధాన కర్త నిత్యుడగు తండ్రి జీవము గల రాజా సర్వసృష్టి కర్త మా ప్రియ పరలోకపు తండ్రి మీకే ఎనలేని స్తుతులు స్తోత్రములు తండ్రి..దేవా మేము మా స్వబుద్ధిని ఆధారము చేసుకోని ఆజ్ఞానముతో గర్వముతో మీ సన్నిధిలో నుండి దూరంగా జీవిస్తున్నాము తండ్రి.దేవా దయతో మమ్మల్ని క్షమించి మా జీవితాలను చూడుము తండ్రీ మేము క్రీస్తు అనే బండ మీద మా జీవితాలను స్థిరంగా కట్టుకోవటానికి కావలిసిన
జ్ఞానమును సహాయము చేయండి.దేవా మా ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితం ఫలింప జేయుము తండ్రి.దేవా ఈ అంత్య కాలము చెడ్డ దినములలో ఈ లోకములో ఎంతో మంది శ్రేష్ఠమైన వారు ఘనులు ధనవంతులు చూడ లేని ఈ మరి యొక నూతన ఉదయ కాలపు దినమును మాకు ఇచ్చినందుకు మీకే స్తుతి స్తోత్రములు తండ్రి.దేవా ఈ దినము మీ సన్నిధి మాతో పాటు రావాలి మీ కనికరం మాతో పాటు రావాలి తండ్రీ.దేవా మా బంధకములను విడిపించే మా తండ్రి మాతో రండీ. ఈ రోజు మీరు మా కోరకు దాచి యుంచిన మేలైనవి శ్రేష్టకరమైనవి ఆశీర్వదములు అనుగ్రహించి మీ కృప కనికరంలు అనుగ్రహించుము తండ్రి. దేవా ఎంతో మంది బిడ్డలు పుట్టు గుడ్డి వారైన పచ్చి తాగుబోతులైన ఏపాపమునకు ఏ వ్యభిచారమనకు ఏ కీడుకు ఏ నాశనమునకు ఏ శాపమునకు బానిసలై ఉన్నారో వారిని ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల పొందుదురు గాక..దేవా ఎంతో మంది యాక్సిడెంట్లు వల్ల కాళ్ళు చేతులు విరిగి పడకలు మీద ఉన్న వారిని లెవనెత్తుము తండ్రి పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి కృంగిపోతు కూర్చిలో కూర్చున్న వారిని ఈక్షణమే బలమైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో స్వస్థ పరచి లెవనెత్తుము తండ్రి.దేవా నమ్ముట నీవలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని మీరు చెప్పినట్లు ప్రభు మేము అడిగిన ప్రతి ఒక్కటీ విశ్వాసముతో అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని విడుదల దయ చేసి స్వస్థతను పొందునట్లు మీ పరిశుధాత్మ కార్యములు జరిగించుము తండ్రి.దేవా ఎంతో మంది బిడ్డలు పరాయి దేశంలో ఉంటూ బంధింపబడి వివిధ రకాల ఇబ్బందులు పడుతున్నారో తండ్రి అటువంటి వారికి మీ పరిశుధాత్మ సహాయము దయచేసి విడుదలను అనుగ్రహించుము దేవా.తండ్రి ఆర్థికముగా చితికిపోయి ఆరోగ్యం క్షిణించి ఎటువంటి దారి కనపడక నిస్సహాయ స్థితిలో దిక్కు లేక మీ దయ గల ప్రేమ,కృప, కనికరం కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో నూతన కార్యము దయ చేసి దీవించుము తండ్రి..దేవా మా చేతి పనులను వ్యాపారములను ఆశీర్వదించి ఈ దిన దీవెనలతో మమ్మల్ని మా కుటుంబములను మా రక్త సంబంధికులను మా స్నేహితులను మా చుట్టు ప్రక్కల వారిని ప్రతీ ఒక్కరూని దీవించి మా సరిహద్దులు విశాల పరిచి ఆశీర్వదించుము అని ఈ నా ప్రార్థన నీ ప్రియుడు మా రక్షకుడు ప్రభువైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్,ఆమెన్,ఆమెన్.🛐🛐🛐🛐🛐🛐🛐
0 Comments