Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 12-DEC-2019

 𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                       Daily Promise 12-DEC-2019
 🙌🙌దీవెన🙌🙌
🙌ఆశీర్వాదం 🙌 🙌🙌🙌🙌🙌🙌
🎄🎄🎄🎄🎄🎄
నా ప్రియమైన ఆత్మీయ సహోదర సహోదరిలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి యొక శ్రేష్టమైన నూతన ఉదయ కాలపు శుభములు.ఈరోజు మీ కుటుంబలలో దేవాతి దేవుడు ఒక నూతన కార్యము జరిగించును గాక  మీరు తలపెట్టిన ప్రతి పనిలోను మీ వ్యాపారంలోను మీ చేతి పనులలోను అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకులు అంధకార దూరాత్మ శక్తులను మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో లయ పరుచును గాక.ప్రభు కృపా మీకు తోడైయుండును గాక. మీకు మీ కుటుంబములో ఉన్న ప్రతి శారీరక మానసిక బాధలు, ప్రతి ఆనారోగ్య సమస్యలు యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా చేయును గాక.మీ ప్రతి  అవసరం యేసు నామములో తీరును గాక.ఈ దినము మిమ్మల్ని  మీ చేతి పనులను మీ జీవన విధానములో మీరు చేయు ప్రతి పనిలో ప్రభు కృపా మీకు తోడుగా ఉండి మీ సరిహద్దులు విశాల పరచి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక ఆమెన్,ఆమెన్,ఆమెన్.🙌🙌🙌🙌🙌🙌

🙇‍♂🙇ప్రార్థన🙇🙇‍♂
🎄🎄🎄🎄🎄🎄
మా మీద ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చిన యేసు నీకే స్తోత్రము.
ద్వితీయోపదేశకాండ 23:5
🎄🎄🎄🎄🎄🎄
🙇🙇🙇🙇🙇‍♂🙇‍♂ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా జీవము గల రాజా సర్వ      సృష్టికర్త మా ప్రియ పరలోకపు తండ్రి ఈ అంత్య కాలము చెడ్డ దినములలో ఈ లోకములో ఎంతో మంది శ్రేష్ఠమైన వారు ఘనులు పండితులు ధనవంతులు చూడ లేని ఈ మరియొక శ్రేష్ట్రమైన రోజు మాకు ఇచ్చినందుకు మీకే ఎనలేని స్తుతులు స్తోత్రములు తండ్రీ.దేవా ఈ ఉదయ కాలములో మమ్మల్ని ప్రతీ ఒక్కరిని చూడుము తండ్రీ. సమాధానం లేని స్థితిలో ఆరోగ్యము లేని స్థితిలో తృప్తి లేని స్థితిలో నిరుత్సాహంతో కృంగిపోతున్న వారిని ఒక్కసారి నీవు దర్శించుము నాయనా నీవు ఎంత ప్రేమిస్తున్నావో వారిని అటువంటి స్థితి నుండి విడిపించటానికి నీవు ఎంతగా సిలువలో నీ రక్తముని కార్చునంతగా ప్రేమను చూపించవో గ్రహించునట్లుగా వారి మనోనేత్రలను తెరువుము తండ్రీ.దేవా నీవు మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించరో అలాగే మేము కూడా మా చుట్టూ ఉన్న వారిని ప్రేమించటానికి మా ఇంటిలో ఉన్న వారిని ప్రేమించటానికి ప్రతి భర్త తన భార్యను ప్రేమించటానికి ప్రతి భార్య తన భర్తని ప్రేమించటానికి ప్రతి కుటుంబములో ప్రేమ సమాధానములు ఉండటానికి సహాయము చేయుము తండ్రీ.దేవా ప్రేమ క్షమిస్తుంది అని సహిస్తుంది అని ప్రేమ జాలీ చూపిస్తుంది అని మా బ్రతుకులో గుర్తించి మీ ప్రేమని పంచటానికి మాకు ఒక్కో ఒకరికి సహాయం చేయుము తండ్రీ.దేవా ఇతరులను ద్వేషించి మాకు మేమే హానీ చేసుకోక ఇతరుల మీద అసూయపడి మమ్మల్ని మేమే నాశనము చేసుకోనక ఇతరులను క్షమించ లేని స్థితిలో ఉండి మేమును క్షమించ బడని వారిగా మిగిలి పోక దేవా సిలువ ప్రేమతో నింపి మమ్మల్ని మేము కాపాడుకొనుటకు మా శరీరాలను ఆరోగ్యంగా కాపాడుకొనుటకు మాకు ఇచ్చిన ఈ శరీరాలు దేవాలయలుగా పరిశుద్ధముగా కాపాడుకోనుటకు మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా జీవించుటకు మాకు సహాయము చేయము తండ్రి.దేవా ఇప్పటికే ఇతరులను ద్వేషిస్తూ తమ్ము తామే ద్వేషించుకుంటు రోగాలు పాలైన వారిని కనికరించుము నీవు పొందిన దెబ్బలు ద్వారా స్వస్థత దయ చేయము దేవా.తండ్రీ ఈరోజు మా వ్యాపారములోను మా చేతి పనులలోను మేము చేయు ప్రతి పనులలోను మీ కృప హస్తముతో మమ్మల్ని కనికరించి దీవించి మా సరిహద్దులు విశాల పరచి ఈ దిన దీవెనలతో మమ్మల్ని మా కుటుంబములను ఆశీర్వదించుము అని నీ ప్రియుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్🙇🙇🙇🙇🙇🙇🎄🎄🎄🎄🎄🎄

Post a Comment

0 Comments