Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 11-DEC-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 11-DEC-2019
🙇🙇‍♂ప్రార్థన🙇‍♂🙇‍♂ 
🎄🎄🎄🎄🎄🎄
నేను నడుచు మార్గము ఏరిగి నన్ను శోధించి సువర్ణము వలె తీర్చిదిద్దు యేసు నీకే స్తోత్రము. యోబు 23:10                
🎄🎄🎄🎄🎄🎄
🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂అభిషక్తుడా,పరమపిత సర్వాధికారి మా జీవితంలో మరి యొక శ్రేష్టమైన ఉదయ కాలమును ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రంలు తండ్రీ.దేవా ఈరోజు మా కుటుంబలలో అనేక రకరకాలుగా రోగములతో శారీరక సంబంధమైన బలహీనతలతో ఉన్నారు తండ్రీ ఒక్కసారి చూడుము దేవా మీరు పొందిన దెబ్బలు చేత మాకు స్వస్థత ఉన్నది అన్నావు కదా ఆ స్వస్థత మాకు దయ చేయుము తండ్రీ. దేవా నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం తోసివేయను అన్నావు కదా తండ్రీ అంత ప్రేమ ఆ కనికరంను మేము గ్రహించుకొనులాగున మా మనో నేత్రములను తెరువుము తండ్రీ.దేవా బాధలతో విచారములతో దుఃఖములతో వారి జీవితాలను వృధా పరుచుకుంటు తాత్కాలిక ఉపశమనం కోసం దురులవాట్లుకు బానిసలై తమ బ్రతుకులను నాశనము చేసుకుంటున్న వారి జీవితాలను ఈక్షణమే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయుము తండ్రీ.దేవా మా దేశములోని ప్రభుత్వ అధికారుల గురించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.దేవా వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి కావలిసిన మంచి జ్ఞానం,శక్తిని, బలమును ధైర్యంను దయచేయుము వారి కుటుంబములను వారి బిడ్డలను దీవించి ఆశీర్వాదించుము తండ్రి.ఆలాగునే అనేకమంది వారి వారి వ్యక్తిగత వ్యాపారములను మరియు చేతి పనులను దీవించి ఆశీర్వాదించుము తండ్రీ.దేవా ఈ చెడ్డ దినములలో మీతో నిత్యం కలిసి ఉండటానికి కావలసిన ప్రార్థన శక్తిని మాకు అనుగ్రహించుము తండ్రీ.దేవా తగ్గింపు ప్రార్థన విధేయత నమ్మకము విశ్వాసం కలిగిన ప్రార్థన నేర్పుము తండ్రీ.దేవా విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో మీ పాద సన్నిధిలో చేరి మీ మీద ఆధారపడే ప్రార్థన చేయటం నేర్పుము తండ్రీ..మా జీవితంలో ప్రతి జీవన విధానములో మీ చిత్తము ప్రకారం చేయుము తండ్రి.సమస్తము మీ అధికారమునకు ఒప్పుకొనుచున్నాము తండ్రీ.దేవా మా ఈ దీన ప్రార్థనని మీ పాద సన్నిధిలో అతి వినయంగా సమర్పించుకుంటు మా ప్రియుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ద నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్🛐🛐🛐🛐🛐🛐 🎄🎄🎄🎄🎄🎄

Post a Comment

0 Comments