Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 09-DEC-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 09-DEC-2019
 🙇‍♂🙇‍♂ప్రార్థన🙇‍♂🙇‍♂
🎄🎄🎄🎄🎄🎄
నేను వెళ్ళిన ప్రతి చోట కి నాకు తోడుగా ఉండి నన్ను ఉన్నతంగా తీర్చి దిద్దు.యేసు నీకే స్తోత్రము. 
1దినవృత్తా 17:8. 🎄🎄🎄🎄🎄🎄
🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂🙇‍♂పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కెరూబులు సెరూబులతో కొనియాడాబడుతూన్న జీవము గల తండ్రి మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు తండ్రీ.దేవా మా జీవితంలో మరి యొక నూతన సోమవారము శ్రేష్ఠమైన ఉదయ కాల సమయమును మా జీవితంలో అనుగ్రహిచిన తండ్రి మీకే ఎనలేని కోట్లాది స్తుతి స్తోత్రములు తండ్రీ.దేవా మా జీవితాల్లో ఈరోజు నుండి మీ చిత్తములో చేయడానికి మాకు సహాయం చేయుము మమ్మల్ని ప్రేమించి మాకు ఉపదేశం చేయడానికి మా మీద మనసు వుంచి మేము నడవలిసిన మార్గమును మాకు బోధించటానికి మా మీద మీ దృష్టిని ఉంచి మాకు అన్ని విషయాలలో నీ సలహాలు ఆలోచనలు చెప్పటానికి నీవు ఆసక్తి కలిగి ఉన్నావు అని గుర్తించి నీ మెల్లని స్వరము వినటానికి అన్ని విషయాలలో నీ చిత్తాని ఎరిగి నడవడానికి మాకు ప్రతి ఒక్కరూకి సహాయము చేయుము తండ్రీ.దేవా నీవు మాకు మంచి కాపరివి మమ్మల్ని పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేస్తావు శాంతికరమైన జలములు యొద్ద నన్ను నడిపిస్తావు గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయం రాకుండా నన్ను కాపాడతావు తండ్రీ నీవు అన్నింటిని అనుగ్రహించే దేవుడవు నన్ను మమ్మల్ని బలపరిచే దేవుడవు నా మా ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడవు తండ్రీ మా పోషకుడవు ఆరోగ్యము ఇచ్చే దేవుడవు మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడవు మాకు రక్షణ ఇచ్చే దేవుడవు మాకు సమృద్ధిని ఇచ్చే దేవుడవు గనుక మా జీవితాలో మీరు కలుగజేసుకొని మాకు మేలులు అనుగ్రహించి మీ కృపలతో దీవించి మీ కృప కార్యములు జరిగించుము తండ్రీ.దేవా ఈ రోజు మా జీవితాలలో ఉన్న కార్యములను నూతనమైన కార్యములుగా జరిగించి తృప్తి పరుచుము తండ్రీ.దేవా మా జీవితాల్లో ఉన్న అపజయలను జయములుగా మార్చి మా జీవితాల్లో అద్భుత కార్యములు జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి మీ పరిశుధాత్మను మా ప్రతి ఒక్కరిపై కుమ్మరించుము తండ్రీ.దేవా మేము ఈ లోకంలో జీవించుటకు చేయు మా ఉద్యోగములలోనూ వ్యాపారములలోనూ మా చేతి పనుల్లోను మా కష్టార్జితమును ఆశీర్వదించుము తండ్రీ.దేవా ఈ రోజు మేము తలపెట్టి మొదలు పెట్టు ప్రతి పనులలోను మేము చేయు కార్యములలోను సమస్తములో మీ అధికారమునకు ఒప్పుకోనుచు మీ పరిశుద్ధ హస్తములకు అప్పగించు కొనుచున్నాము తండ్రి.దేవా ఈదినము మా సరిహద్దులను విశాల పరచి మీ ఆకాశపు వాకిళ్ళు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించుము అని ఈ నా ప్రార్థన మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము.తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్🛐🛐🛐🛐🛐🛐
🎄🎄🎄🎄🎄🎄

Post a Comment

0 Comments