𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 07-DEC-2019
నీవు కట్టబడేటట్లు
"నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు".
( కీర్తనలు 92:12 )
నీవు ఎప్పుడైన గొప్పతుఫానులో ఖర్జూరపుచెట్టును ఎప్పుడైన చూసావా? అన్నీ చెట్లవలేకాక ఈ ఖర్జూరపుచెట్టు గాలి ఒత్తిడి ఎంతైనా అంతగా వంగగలదు. కొన్ని రకాలైన ఖర్జూరపుచెట్లు పైనున్న చిగురు భూమిని తాకగలదు. ఒకసారి గాలితగ్గిపోగానే అది తిరిగి పైకి వెళ్ళిపోతూంది. అంతవొత్తిడిలో ఆచెట్టు అలా ఒంగటములో ప్రత్యేకత ఏమిటి ? అది ఒంగటము, సాగటము , ఒత్తిడి ఆచెట్టు భూమిలోని వేళ్ళను బలపరచి చెట్టు ఇంకా పొడుగవ్వాటానికి కారణమవుతూంది.
దేవుడు, నీవు ఖర్జూరపువృక్షమువలే ఎదుగుదురు అనిచెప్పటానికి కారణము ఈ లోకములో కొన్ని శ్రమలను మనము ఎదుర్కొనవలసివస్తూంది, కొన్ని వ్యతిరేక పరిస్థితులు నీ సంతోషాన్ని, సమాధానమును పాడుచేస్తాయి అని ఆయనకు తెలుసు. ఒత్తిడిలోనూ, జీవిత తుఫానులోను , ఒంగటములోనూ బలపడి, ఆరోగ్యముతో, తెలివిగా క్రొత్త ఎదుగుదలకు సిద్ధపడతావని దేవుడు నీవు ఖర్జూరపువృక్షమువలే అని పోల్చారు. దేవుడు అదే విధముగా నీకు చేస్తారు అనుకొనవద్దు. నీ కష్టసమయములలోను , చీకటి కాలములోను నీ పక్షముగా శతృవే చెల్లించేటట్లు చేస్తారు. ఆ ఆపదను నీకు మేలుగా ఎలాగమార్చగలరు? అది నిన్ను కూల్చిపడవేయలేదు కాని నీవు కట్టబడేటట్లు చేస్తూంది. నిన్ను బలహీనపరచలేదుకాని బలవంతునిగా చేస్తూంది. "మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి " అనే వాక్యము నేరవేరుటను గమనించగలవు.
ఈ విధముగా ప్రార్ధన చేద్దామా: పరలోకమందున్న తండ్రీ మీరు నన్ను బలపరచుచున్నందులకు వందనములు. ఈ జీవితకాలములో తుఫానులమధ్య మీరు నా జీవితములో పనిచేయుచున్నారని నేను నమ్ముచున్నాను. మీరు నన్ను బలవంతునిగాను, జ్ఞానవంతునిగాను చేయుచున్నందులకు వందనములు చెల్లించుచు యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రీ! ఆమెన్.
0 Comments