𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 27-NOV-2019
ఆయనతో సమయమును
"... శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు."
( కీర్తనలు 23:2 )
నాకు ఆలోచించటానికి కూడా సమయము సరిపోవటములేదు అని నీవు అంటే, అన్ని ప్రక్కలనుండి ఒకేసారి వచ్చిపడే ఆ భయంకరమైన ఒత్తిడులను నీవు ఎలా తట్టుకొనగలుగుతావు? దేవుని వాక్యమును చదువకపోతే నీ జీవితములో సమాధానము దొరకడం చాలా కష్టము. మనము దేవుడు చెప్పేది వినేటట్లు ఆయన గట్టిగా అరవనవసరములేదు. చిన్నదైన మెల్లని స్వరముతో మాటలాడగలరు.( 1 రాజులు 19:12 ) అర్ధమేమిటంటే మనము ఆయనకు దగ్గరగా వినాలి.
దేవుని స్వరమును వినటానికి నీవు ఏమి చేయగలవు? తాళము ఏమిటంటే నీ వ్యాపారములోను, నీ వ్యాపకములన్నింటిలోనూ కొంత సమయమును దేవునికి కేటాయించాలి. నీ ఇంటిలో ఒక స్థలమును చూసుకో లేక, బయటవుంటే ఒక చెట్టు నీడలోనన్న లేక నీవు ఏకాంతముగా వున్న స్థలమునైనా ప్రతీ దినము కొంత సమయమును దేవునితో గడపాలి. నీవు ఆయనతో సమయమును గడిపే కొలదీ ఆయన నిన్ను నూతన పరచి నీసమాధానమును పునరుద్ధరించగలరు.
ప్రార్ధన: తండ్రీ నాలో ఆ శాంతికరమైన జలములు ప్రవహించునట్లు ఆ సమయము , స్థలము కొరకు ప్రత్యేకపరచుకోవాలని నిర్ణయించుకొనుచున్నాను. మీ చిత్తమును గ్రహించునట్లు నాతో మాటలాడమని యేసునామములో ప్రార్ధించుచున్నాను తండ్రీ !
ఆమెన్ .
0 Comments