Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓 Daily Promise 25-NOV-2019

𝖀𝖓𝖎𝖖𝖚𝖆𝖑 𝕮𝖗𝖊𝖆𝖙𝖎𝖔𝖓                      Daily Promise 25-NOV-2019

✳ *ప్రభువును సంతోషపెట్టుటయే నీ కోరికగా ఉండనిమ్ము....✍*

ఒక కారణాన్ని బట్టి దేవుని అంగీకారము 30 సంవత్సరాల వయస్సులో ప్రభువైన యేసు మీద ఉన్నది. అదేమనగా ఆయన జీవితకాలమంతయు నమ్మకముగా శోధనను జయించారు. 

*తనకొరకు తాను కాకుండా తండ్రి కొరకే జీవించాడు. తన్నుతాను సంతోషపరచుకొనుటకు ఆయన ఏమియు చేయలేదు* (రోమా 15:3). 

బాప్తిస్మము తీసుకొన్న తరువాత తండ్రి ఈలాగు సాక్ష్యమిచ్చారు *''ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను''.* అంతేగాని *''నేను ఆశీర్వదించిన నా ప్రియకుమారుడు''* అని అనలేదు. రెండవసారి చెప్పిన ఈ సాక్ష్యములో ఏమియులేదు. మొదట ఇచ్చినదే అనగా దేవుని అంగీకారమే ప్రభువైన యేసుకు సర్వమైయున్నది. 

*ప్రభువైన యేసును వెంబడించుట అనగా మనము కూడా దేవుని యొద్దనుండి అటువంటి సాక్ష్యమును కోరాలి.*

ఆదాము సంతానముగా, మన కొరకు మనమే బ్రతికే స్వభావముతో మనము పుట్టాము. ప్రతీది కూడా మనచుట్టూనే తిరుగుతూ, మనకు సేవ చేయాలని ఆశిస్తాము. మనము రక్షణపొందినప్పుడు దేవుడు కూడా అనేక విధాలుగా మనలను ఆశీర్వదించి మనకు పరిచర్య చేయాలని ఆశిస్తాము. 

*మొదటిగా మనము పాపక్షమాపణ కొరకు తరువా త స్వస్థత కొరకు మరియు ఉద్యోగము, ఇల్లు, వివాహము, ఈలోకసంబంధమైన అభివృద్ది కొరకు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తాము.* ఇతరుల దృష్టిలోను మరియు మన దృష్టిలోను మనము మతాసక్తి కలిగియున్నను మనకొరకే మనము జీవించే అవకాశము ఉన్నది. 

అందరితో పాటు దేవుడు కూడా ఒకరై కేవలము ఆయనలో నుండి ఏమిపొందెదమా అని ఆశిస్తూ మనము ఉండవచ్చును. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దనుండి ఆహారము పొందుటకు వచ్చియున్నాడు. అయినప్పటికీ తండ్రి ఎంతో ప్రేమతో అతనిని చేర్చుకొన్నాడు. 
*మన కోరికలన్నియు స్వార్థముతో ఉన్నప్పటికినీ దేవుని ప్రేమతో మనలను చేర్చుకుంటాడు. మనము పూర్తిగా స్వార్థముతో ఆయన దగ్గరకు వచ్చినప్పటికినీ, సంతోషముతో మనలను చేర్చుకొనునంతగా ఆయన మనలను ప్రేమించియున్నాడు.* అయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చేటటకువంటి ఆయన స్వభావములో మనము తరువాత పాలివారమవుతామని దేవుడు నిరీక్షిస్తాడు. 

అయినప్పటికినీ ఆయన బిడ్డలనేకులలో ఇటువంటి గ్రహింపును ఆయన కలుగజేయలేకపోవుచున్నాడు. ఎల్లప్పుడు *''నేను'' ''నాకు''* మరియు *''నాది''* అని ఈ లోకసంబంధమైన ఆశీర్వాదాలతోనే వారు తృప్తిపొంది అలాగే జీవించి చనిపోతారు.

👉 *మన మనస్సు మారి నూతనపరచబడి, పరిణితి చెందినప్పుడు దేవునిలో నుండి మనము ఏమి పొందుకుంటామో అని మాత్రమేగాక మనలో నుండి దేవుడు ఏమి పొందగలడు అని ఆలోచిస్తాము.* మన మనస్సు నూతనపరచబడి రూపాంతరము పొందెదము (రోమా 12:2).

👉 ఇదియే సీయోను పర్వతము మీద దేవుని గొఱ్ఱెపిల్లతో 144000 మంది నిలుచుటకు అర్హులుగా చేసింది (ప్రకటన 14). 

*కోపము, మోహతలంపులు, ధనాపేక్ష మొదలగు వాటిమీద జయము పొందుట మాత్రమే ఆత్మీయతకాదు. తనకొరకు తననాల జీవించుటకు సాగిపోవాలి.

 *మన సొంతలాభము, మన సొంతసౌఖ్యము, మన సొంతచిత్తము, మన సొంతహక్కులు, మన సొంతఘనత మరియు మన సొంతాత్మీయతను వెదకుట ఆగిపోవాలి.*

👉 శిష్యులు ప్రార్థించుట నేర్పుమని ప్రభువైన యేసును అడిగినప్పుడు, ఆయన *''నేను'', ''నాకు'' లేక ''నాది''* అనేమాటలు లేని ప్రార్థన వారికి నేర్పించారు (లూకా 11:1-4).

 మొదటిగా తండ్రినామమును గూర్చి మరియు ఆయన రాజ్యము మరియు చిత్తము గూర్చి చెప్పి తరువాత *మనకొరకు* ఏలాగో అలాగే *మన తోటి విశ్వాసులకొరకు* లోవసంబంధమైన మరియు ఆత్మీయ క్షేమముకొరకు ప్రార్థించమన్నారు. (అనగా *''నాకొరకు'', ''నాకొరకు''* అని కాకుండా *''మాకొరకు'' ''మా కొరకు''* అని అర్థము). 

👉ఈ ప్రార్థనను మనము కంఠస్థం చేసి, ఒక పిట్టలాగా మరలా మరలా చెప్పటం చాలా సులభము. 
*కాని హృదయపూర్వకముగా ఆ ప్రార్థన చేయుటకు మనము స్వయాన్ని విడిచి మన హృదయములో దేవుని కేంద్రముగా ఉండాలి.* మనమలను మనము ఎల్లప్పుడు విమిర్శంచుకొనినట్లయితే, సొంతసౌఖ్యమును మరియు సొంతహక్కులను అనగా సొంతసుఖమునే కోరే నియమము మనలో ఉన్నట్లు కనుగొనగలము (రోమా 7:22).

*దేవుని రాజ్యమును మొదట వెదకుమని* ప్రభువైన యేసు చెప్పారు.
👉 *అనగా మనము స్వార్ధాన్ని విడిచి, దేవునినే మనము కేంద్రముగా కలిగియుండాలి.*

🔹 *భూమిమీద తండ్రిచిత్తము నెరవేర్చుటకు పరలోకములో ఉన్న సౌఖ్యాన్ని ప్రభువు వదులుకున్నారు.*

🔹 *అపొస్తులుడిగా  ఉండి ప్రభువుకొరకు అనేక శ్రమలను భరించుటకు పౌలు తార్సులో సుఖవంతమైన క్రైస్తవ వ్యాపారవేత్తగా ఉండుటను విడిచిపెట్టాడు.*

🔹 *ప్రతి అపొస్తులుడు కూడా దేవునినే కేంద్రముగా కలిగియుండే త్యాగపూరితమైన జీవితాన్ని జీవించారు.*

👉 ఈనాటి *''సంచారము చేసే బోధకులకు''* వేరుగావారు, భూమిమీద దేవుని రాజ్యము విస్తారించుటకు వారు అన్నిటిని విడిచిపెట్టారు.

*మనము కోపము మీద మరియు మోహతలంపులమీద జయము పొందినప్పటికీ, మనము ఇంకను స్వంత సుఖమునే కోరుచున్నట్లయితే అది నిజమైన పరిశుద్ధతకాదు.*

👉 చాలామంది దీనిని గ్రహించలేకున్నారు. అందువలన సాతాను వారిని మోసము చేయగలగుచున్నాడు. 

*చాలామంది క్రైస్తవులు వారి సుఖము కొరకు మరియు ఆస్థి సంపాదనకు వేరే దేశాలు వెళ్ళుచున్నారు. అయినప్పటికీ వారు వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదాలు కలిగియుండవచ్చును గాని దేవుని అంగీకారము పొందలేరు.*

👉 ఎందుకనగా ఎవరైనను దేవునిని మరియు సిరిని సేవించలేరు (అనగా సంపదలు, సౌఖ్యముల మొదలగునవి) మనమీద మరియు మన పిల్లలమీద దేవుని ఆశీర్వాదము ఉండుటను బట్టి దేవుడు మన విషయములో సంతోషముగా ఉన్నాడనుకొంటే అప్పుడు సాతాను మనలను మోసగిస్తాడు. 

*దేవుని ఆశీర్వాదము మరియు దేవుని అంగీకారము ఈ రెండు ఒకటికాదు.*

👉 మనము చనిపోయిన తరువాత ఈ రెండు ఒకటికాదు. మనము చనిపోయిన తరువాత *''అతడు దేవునికి ఇష్టుడైయుండెను''* అనే హానోకు సాక్ష్యమును కలిగియుండాలి (హెబ్రీ 11:5). మూడు మాటలే- *అయినను భూమి మీద అంతకంటే శక్తివంతమైన సాక్ష్యమును కలిగియుండలేము.*
ప్రభువైన యేసు మరియు పౌలు ఈ సాక్ష్యమును కలిగియుంన్నారు.

👉 కేవలము *''దేవుడు నన్ను ఆశీర్వదించాడు''* అనే సాక్ష్యమేమియు గొప్పదికాదు ఎందుకంటే అనేకమంది అవిశ్వాసులు కూడా అట్టి సాక్ష్యాన్ని కలిగియున్నారు. 
*ఆయన ఆశీర్వాదాన్ని మాత్రమేగాక దేవుని అంగీకారాన్ని కూడా కోరేవారి కొరకు దేవుడు చూచుచున్నాడు.

Post a Comment

0 Comments