✝✝🙏🙏ప్రార్థన🙏🙏✝✝ ( 04-NOV-2019 Morning Prayer )
" నా ఆలోచన యావత్తు సఫల పరచు యేసు నీకే స్తోత్రము.
కీర్తనలు 20:4"
🙇🙇🙇🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂🙇♂నిత్యము కెరూబులు సెరూబులతో వేవేళ్ళ దూతలతో స్తుతించపడుతున్నా పరిశుద్ధుడా మాప్రియ పరలోకపు తండ్రి ఈ అంత్య కాలము చెడ్డ దినములో ఈలోకంలోఎంతో మంది శ్రేష్ఠమైన వారు ఘనులు ధనవంతులు అధికారులు చూడలేని ఈమరి యొక నూతన శ్రేష్ట్రమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకే మహిమ ఘనత ఎనలేని స్తుతులు స్తోత్రములు తండ్రి.దేవా ఈ దినమున మా కుటుంబలలో ప్రతి వ్యక్తిని చూడుము తండ్రీ మా కుటుంబములో ఐక్యత లేదే ప్రేమ లేదే మా దాంపత్య జీవితములో దీవెన లేదే అని ఎవరు ఈరోజు కృంగిపోతున్నరో అటువంటి భర్తను భార్యను ఈసమయములో నీ ప్రేమతో నింపుము తండ్రీ.దేవా ప్రేమతో తన కుటుంబని కట్టుకోవటానికి తన జీవిత భాగస్వామిని మార్చుకోవాటానికి మీ ప్రేమలో కుదురుతుంది అని గ్రహించుకోవటానికి సహాయం చేయుము తండ్రీ.దేవా అనేక కుటుంబలలో సాతాను జోరబడి కలుగజేస్తున్నా భేదలను విభేదాలను బాధలను సమస్యలను ఈక్షణమే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుము తండ్రీ.దేవా నా జీవితంలో నా కుటుంబ జీవితంలో దీవెన లేదే అని నీ చెంత చేరి మొఱ్ఱ పెడుతున్నరో అట్టి వారి జీవితాల్లో ఇప్పుడే ఒక అద్భుత కార్యము జరిగించండి తండ్రీ.దేవా నీవు ఇచ్చిన మా బిడ్డలకు నీ చిత్తములో వివాహాము జరగాలి అని ఆశ కలిగిన తల్లిదండ్రులకు వారి ఆశను తీర్చుము తండ్రీ.దేవా మా బిడ్డల వివాహం విషయంలో నిర్లక్ష్యంగా ఉండక దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్ధించటానికి దేవుని చిత్తములో వారికి భాగస్వాములను ఏర్పాటు చేయటానికి మీ చిత్తములో వివాహాములు జరగడానికి కుటుంబాలు కుటుంబాలుగా దీవించబడటానికి ప్రతి ఒక్కరూపై మీ కృప వరములను అనుగ్రహించుము తండ్రి.దేవా మా కుటుంబములలో అనేక మంది యవ్వన బిడ్డలు ఈలోక ప్రేమ కోసం ప్రాకులాడుచు నిజమైన మీ ప్రేమని మరచి జీవితంలో శాంతి సమాధానం లేక ఆర్ధికముగా మానసికంగా శారీరకంగా చితికిపోయి చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నరు తండ్రి వారి బ్రతుకులలో మీ వెలుగుని నింపుము దేవా.తండ్రీ యవ్వనములోనే జీవితములు నాశనం కాకుండా మీ సిలువ రెక్కలు క్రింద మా యవ్వన బిడ్డలను సంరక్షించుము తండ్రి మా కష్టార్జితము అన్యులు పాలు కాకుండా కాపాడుము తండ్రీ.దేవా మీ ఆకాశపు వాకిండ్లును విప్పి మా కుటుంబములలో ఉన్న ప్రతి క్షామ స్థితి నుండి సమృద్ధిని దయ చేయుము తండ్రి.ఈ ఉదయ కాలపు దీవెనలతో మమ్మల్ని మా కుటుంబములను దీవించి ఆశీర్వదించుము అని నీ ప్రియుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్,ఆమెన్,ఆమెన్.
🙇♂🙇♂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♂🙇♂
0 Comments